నేటిసాక్షి కొడిమ్యాల : కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థులు. గ్రామ పెద్దలు దాతలు. విద్యార్థులకు సుమారుగా 1,90,000/- రూపాయలతో కమర్షియల్ వాటర్ ప్లాంట్, కూల్ ఫ్రిడ్జ్, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు, 10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్, పెన్ లు మరియు అస్తవ్యస్తంగా ఉన్న పాఠశాల క్రీడామైదానం ను బాగుచేయించి అన్నింటిని ఈ రోజు ప్రారంభించి పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో దాతలు అలీం, గణేష్, లక్ష్మణ్, రవీందర్ రెడ్డి, లింగారెడ్డి, ఐలయ్య, అజయ్ రెడ్డి, అనిల్ గౌడ్, సతీష్ రావు,బుషన్రెడ్డి, స్నేహస్పూర్తి ట్రస్ట్, మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు





