Wednesday, March 18, 2026

ఆలయ నిర్మాణానికి రెండు లక్షల విరాళం అందజేత

శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహబూబ్నగర్ జిల్లాలో ఇంత పెద్ద శ్రీకృష్ణ ఆలయం లేదని ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులందరినీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో నూతన ఆలయంలో శ్రీకృష్ణ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు తమ వంతు ఆర్థిక సహాయం అందజేయ గలరని కోరిన ఆలయ కమిటీ సభ్యుల అభ్యర్థనకు స్పందించిన ఎమ్మెల్యే 2 లక్షల రూపాయల నగదును విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ప్రవీణ్ అయ్య, వెల్టూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, చీర్ల శేఖర్, మణిగిల్ల తిరుపతి రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పట్టణ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News