Thursday, March 19, 2026

శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయమునకు విరాళం

నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు కొడిమ్యల వాస్తవ్యులు దొంతుల అనసూర్య నారాయణ గార్ల కుమారుడు దొంతుల రవీందర్ లలిత గార్ల కుటుంబ సభ్యులు సంతోష్ కుమార్ ధనలక్ష్మి .సాయిశ్రీ శ్రీనివాస్. నవ్య లక్ష్మణ వాసు. మనుమలు మరియు మనమరాలుల కుటుంబం ఆలయానికి “శాశ్వత చందా దారులుగా” 25,116=00/-(ఇరువై అయిదు వేల నూట పదహారు) ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయానికి ధన రూపేనా సహకరించిన దాతలకు అర్చకులు నాగరాజు రమేష్ తీర్థ ప్రసాదములు అందజేసి స్వామివారి మంగళ శాసనములతో ఆశీర్వదించారు. ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి సహకరించిన దాతల కుటుంబానికి నిర్మాణ కమిటీ, భక్తులు, గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News