నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గల శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయ ధ్వజస్తంభం పున: నిర్మాణం కొరకు దాతలు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి, దీప్తి దంపతులు 50,116 రూపాయలు మరియు ముస్కు కొండల్ రెడ్డి, విజయలక్ష్మి ,వారి కూతురు దీప్తి రెడ్డి, కుమారుడు రాజా సంతోష్ రెడ్డి లు 50,116 రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి వారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు.





