Tuesday, March 10, 2026

బాధిత కుటుంబానికి అండగా దాతలు…

  • మూడు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండు అందజేత
  • కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్) :

రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన మిట్ట కుమార్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా కుటుంబ దీనస్థితి చూసి దాతలు ఒక్కొక్కరుగా డబ్బులు పోగు చేశారు. పోగుచేసిన మూడు లక్షల రూపాయలను కుమార్ కుమారుడైన నిహాన్స్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా దాతలకు కుటుంబ సభ్యులు కన్నీటితో ధన్యవాదాలు తెలిపారు. ఒక కుటుంబానికి దాతలు పెద్ద ఎత్తున అండగా నిలవడం హర్షించదగ్గ విషయం అని గ్రామస్తులు ఆనందం వ్యక్త చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News