Monday, March 16, 2026

అక్రమ కేసులకు భయపడం

  • కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

నేటి సాక్షి, మెట్ పల్లి ప్రతినిధి : పోలీసులతో దబాయించి, అక్రమ కేసులు బనాయిస్తూ, అబద్దాలతో బుకాయించుకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని ఈ కేసులకు బి ఆర్ ఎస్ కార్యకర్తలు, నాయకులు బయపడరని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మల్లాపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు బండి లింగస్వామి గౌడ్, ముద్దం శరత్ గౌడ్, మ్యాకల సతీష్, బైరి రవికుమార్ యాదవ్, బైరి రాకేష్ యాదవ్ ల మీద కొందరు కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా అక్రమంగా ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు బనాయించరని ఆరోపిస్తూ వారి నివాసాల్లో కలిసి పరామర్శించి, వారికి మనోదైర్యాన్ని ఇచ్చారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కాంగ్రెస్ నాయకులతో స్నేహపూర్వకంగా ఉండి వారి ఇంటికే టీటీడీ టిక్కెట్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపి ఏమైన ఆపదొస్తే అండగా ఉండేవారని తెలిపారు.ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల ఇంటికి పోలీసులని, కేసుల ఫైళ్లని పంపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో కొందరు వారి స్వార్థం కోసం కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఖండించారు, అక్రమ కేసుల్ని బేషరతుగా వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. బీఆర్ఎస్ యువకులు ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ప్రజల హక్కుల కోసం మేము పోరాడుతూనే ఉంటాం అని వాఖ్యానించారు. మాకు ఉద్యమాలు కొత్త కాదు. అరెస్టులు కొత్త కాదు జైళ్ళు కొత్త కాదు, మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటాం, కోరుట్ల నియోజకవర్గ ప్రజల హక్కులు సాదించుకుంటాం అని తెలిపారు. ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గంలో ఐదుసార్లు ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులు ప్రజల సంక్షేమంపై ద్రుష్టి పెట్టి ప్రజాదరణ పొందాలని హితువుపలికారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News