నేటి సాక్షి, సైదాపూర్:
సైదాపూర్ మండలంలో నూతనంగా ఏర్పడ్డ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దొంత సుధాకర్, వైస్ చైర్మన్ గా న్యదండ్ల రాజ్ కుమార్, బాధ్యతలు చేపట్టినారు. డైరెక్టర్లుగా నెల్లి సదానందం, మహమ్మద్ చోటేమియా, పల్లె గోపాల్ రెడ్డి, బొల్లం సమ్మయ్య, పెద్ది తిరుపతి, బైరి రాజు, చల్లూరి రాజయ్య, మద్దూరి రజిత-రవీందర్ రెడ్డి, ఎర్రల శ్రీనివాస్, తాళ్లపెళ్లి వెంకటేశం, ఉడిగే రాజశేఖర్ లు బాధ్యతలు చేపట్టినారు. దొంత సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, హస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రవాణా శాఖ& బీసీ సంక్షేమశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆశీర్వాదంతో సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా అని దొంత సుధాకర్ అన్నారు. కమిటీని బాధ్యతలు చేపట్టిన నుండి రైతులను ఆర్థిక అభివృద్ధి చెందటానికి కృషి చేస్తాం అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గుండారాపు శ్రీనివాస్, బొమ్మగాని రాజు, వేముల సురేష్, వెల్దీ రాజు, గొల్లపల్లి యాదగిరి, మేకల రాజు, గడ్డం శేఖర్, గోపాగోని నవీన్, రాగుల వేంకటి పాల్గొన్నారు.