నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్) : ఈనెల 27న.జరిగే కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ, విఎన్ఆర్ టీం సభ్యులు పలువురు గన్నేరువరం మండల కేంద్రము లో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జిలు సద్గురు రవీందర్, దేశరాజు అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి , మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, రాపోలు నవీన్, మంకాలి మల్లిఖార్జున్ , ముడికే అజయ్, కండె ప్రశాంత్, హరీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.





