
నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంస్థ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ( ఏఐపిసి ) హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నేషనల్ హెడ్ గా డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ చక్రవర్తి శుక్రవారం నియామక పత్రాన్ని ఆదిత్య రెడ్డి కి అందజేశారు.వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ జిల్లెలఆదిత్య రెడ్డి ప్రస్తుతం ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పెద్ద కుమారుడు ఆదిత్య రెడ్డి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెల్త్ కేర్ నేషనల్ హెడ్ గా నియమితులు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.ఏఐపిసి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డాక్టర్ ఆదిత్య రెడ్డి దేశంలోని 28 రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కృషి చేయాలని జాతీయ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి సూచించారు.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏఐపిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ను సమీకరిస్తానని డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు.తన నియామకానికి కృషి చేసిన ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కి,ఎఐసిసి లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కి, ఆధినాయకురాలు సోనియా గాంధీ కి , ఎంపీ ప్రియాంక గాంధీ కి, ఏఐపిసి చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి కి డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.





