నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) :
హుజురాబాద్ పట్టణ పరిసర గ్రామాలలో డా. శ్రీకాంత్ రెడ్డి అంటే తెలియని వారుండరు. ఎంతో మంది రోజులకు నయం చేసిన చేతులవి. పండుగ వేళ ఆయన జన్మదినం కావడం విశేషం. హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి లాప్రోస్కోపీ సర్జన్ గా, జమ్మికుంట ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పారుపేల్లి శ్రీకాంత్ రెడ్డి సేవలు ఎనలేనివి. ఆయన ఒక వైద్యునిగా కాకుండా అందరికీ మంచి సన్నిహితులు. కోవిడ్ వచ్చిన సమయంలో ఆయన చాల మంది రోగులకు తనవంతు కర్తవ్యంగా సేవలు చేసిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి మాత్రమే. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ హర్షం …
బుధవారం డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ ఆస్పత్రిలో శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చేత కేక కట్ చేసి కేకు తినిపించి, ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మారుమూల గ్రామం నుంచి పేద కుటుంబం నుండి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి నిస్వార్ధంగా సేవలందిస్తూ.. పేద ప్రజల ప్రాణాలు రక్షిస్తున్న గొప్ప వైద్యుడు అన్నారు. ఎంతోమందికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తక్షణమే స్పందించి సరైన సమయంలో సరైన వైద్యం అందించి ప్రాణాలు రక్షించిన పేదల వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి అని కొనియాడారు. అలాంటి వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి నిండా నూరేళ్లు జీవించి పేద ప్రజలకు మరెన్నో సేవలందించాలని ఆకాంక్షించారు.





