Sunday, March 15, 2026

స్థానిక ఎన్నికల ఓట్ల కోసమే రైతు భరోసా పేరుతో డ్రామా

  • మండల అధ్యక్షుడు దేగవత్ తిరుపతి
  • ఉమ్మడి మానాలలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ
  • ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు

నేటి సాక్షి ప్రతినిథి, రుద్రంగి (కోక్కుల వంశీ) : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన చెక్కులను బిఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. రుద్రంగి మండలం ఉమ్మడి మానాల దేగవత్ తండా గ్రామంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ముగ్గురు లబ్దిదారులకు మూడు 94000/- రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా దేగావత్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ యస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని అన్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు 15000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి గద్దేనెక్కరని, ఇప్పటివరకు కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదని కానీ ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతులందరికీ 15000 రాకున్నా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకుండా, ఇండ్లు ఉన్నవారికి ఇండ్లు మంజూరు అయ్యాయని ఇల్లు లేని వారికి అసలు మంజూరే కాలేదని, రైతు రుణమాఫీ కూడా పూర్తిగా మాఫీ చేయలేరని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాల పేరుతో సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో అమలుకాని, ఆచరణకు నోచుకోని హామీల గురించి ప్రజాక్షేత్రంలో, గ్రామసభల్లో ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు సబబు అని వారు మండిపడ్డారు. హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారాన్ని దక్కించుకున్నదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే రైతుభరోసా అనే డ్రామా ఆడుతున్నారని, రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. జనవరి 26న మొదలై మార్చి 31 వరకు సాగడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా పాలన గ్రామ సభలో దరఖాస్తుల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉందన్నారు. బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే వేలాది కుటుంబాలను సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకునట్లు తెలిపారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, నాయిని రాజేశం,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామ్ సుందర్, భూమా నాయక్, మాజీ సర్పంచ్ లు గజల్, మంగీలాల్, మోహన్, మాజీ వార్డు సభ్యులు చెప్యాల గణేష్, విజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News