Saturday, March 28, 2026

ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో త్రాగునీరు బోర్లు మంజూరు

  • ఎంపీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : గంగాధర్ నెల్లూరు మండలం నెల్లపల్లి పంచాయతీలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సహకారంతో జడ్పీ నిధులతో నెల్లేపల్లి పంచాయితీ చిన్న మిట్టపల్లి గ్రామంలో నూతన బోరు మోటారు పైపులైన్లు వేయడం జరిగింది. అలాగే కొత్తూరు గ్రామంలో నూతన బోరు మోటరు త్రాగునీరు పైపులైన్లు వేయడం జరిగింది. అలాగే నెల్లేపల్లి గ్రామంలో నూతన బోరు మోటరు పైప్ లైన్లు వేయడం జరిగింది. మా గ్రామానికి త్రాగునీరు బోర్లను వెంటనే మంజూరు చేసిన ఎంపీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగయ్య, మాజీ సర్పంచ్ పుష్పరాజ్, యాదవ సాధికారత సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, మాజీ ఎంపిటిసి సుబ్రహ్మణ్యం, టి ఎన్ టి యు సి కార్యదర్శి దేవరాజుల నాయుడు, మాజీ సర్పంచ్ వెంకటపతి రెడ్డి, తుకారం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News