Tuesday, March 10, 2026

3 రోజులు త్రాగునీటి సరఫరా నిలిపివేత

  • ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ కే. పూర్ణ చందర్
  • జనవరి 7 నుంచి జనవరి 9 వరకు నీటి సరఫరా బంద్

నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి పట్టణం, పెద్దపల్లి మండలం, శ్రీరాంపూర్ మండలం, ఓదెల మండలంలోని కొన్ని గ్రామాలలో మూడు రోజులపాటు త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ కే.పూర్ణ చందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.పెద్దపల్లిలోని శాంతి నగర్ వద్ద వేసిన పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తు పనులు చేసేందుకు జనవరి 7 నుంచి జనవరి 9 వరకు త్రాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నామని, దీనివల్ల పెద్దపల్లి మున్సిపాలిటీ, పెద్దపల్లి శ్రీరాంపూర్ మండలాలు, ఓదెల మండలంలోని కొంత భాగానికి త్రాగునీటి సరఫరా ఆగిపోతుందని, ప్రజలు దీనిని గమనించాలని ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ ఆ ప్రకటనలో తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News