నేటి సాక్షి పలాస కాశీబుగ్గ రమేష్ కుమార్ పాత్రో:
జనవరి 1 వ తేది నుండి ఇంటర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు 1,10 లక్షల వ్యయంతో కేజీబీవీ బాలికల కళాశాల భవనం ప్రారంభం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో. 1,10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కేజీబీవీ బాలికల కళాశాల భవనాన్ని ప్రారంభించిన అభివృద్ది ప్రధాత రాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, సహకార, మార్కెటింగ్, మత్స్య శాఖా మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్వమైందని ఆరోపించారు. ఐదేళ్లలో 40 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.