- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా, నర్సాపూర్ నేటి సాక్షి భూమయ్య : జిల్లాలోని అన్ని సంక్షేమం పాఠశాలలు వసతిగృహాల్లో మెనూ పగడ్బందీగా మలు నర్సాపూర్ అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల వసతి గృహంలో ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న జిల్లా కలెక్టర్
చదువు తోనే సమాజంలో ఉన్నత స్థానం సాధించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల వసతి గృహంలో శుక్రవారం రాత్రి బస చేసిన కలెక్టర్ ఉదయం అల్పాహారం నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మెనూ పకడ్బందీగా అమలులో సంతృప్తి వ్యక్తపరిచారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠశాలలో బోధన విధానం, సమస్యలు ఏమైనా ఉన్నాయా, పాఠశాలలో ఇంకా కావాల్సిన వసతులు, జీవితంలో ఏలాంటి ఉద్యోగం చేయాలి, ఏం అవ్వాలి అనుకుంటున్నారు, తల్లిదండ్రుల ఆశయం మొదలగు వివరాలను కలెక్టర్, పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి గుణాత్మక విద్య అందిస్తున్నామన్నారు. కంప్యూటర్ యొక్క ప్రయోజనాలు, మారుతున్న టెక్నాలజీ వలన పిల్లలకు మంచి, చెడు గురించి కలెక్టర్ వివరించారు. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలని అన్నారు. పాఠశాల విద్యార్థులు తాము నిర్దేశించుకున్న గమ్యాలను ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒకసారి డైరీలో రాసుకోవాలని అన్నారు. లక్ష్యం సాధన దిశగా మన ప్రయాణం చేరుకునేందుకు మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు వారి ఆరోగ్యం, ఎదుగుదల పట్ల కూడా శ్రద్ధ వహించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్ తినే అలవాట్లు తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, గిరిజన గురుకుల. వసతి గృహ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





