Thursday, March 19, 2026

మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి

  • అడిషనల్ డీసీపీ ఎం. రవి

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, (సందెల రాజు) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ మరియు ఎఫ్. ఏఫ్. ఎం. ఎం సోషల్ సర్వీస్ సొసైటీ వరంగల్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిర్మూలన మరియు వెట్టిచాకిరి నిర్మూలన పై ప్రచారం కొరకు రూపొందించిన గోడ పత్రికలను మరియు కరపత్రిక లను అడిషనల్ డీసీపీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ మానవ క్రమ రవాణా మరియు వెట్టిచాకిరి అనేది ప్రజల ప్రాథమిక హక్కులను కోల్పోయే విధంగా ఉంటుందని అట్టి వాటిని గుర్తించి వాటి నిర్మూలన కొరకు అందరము కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిఆర్బి ఏసిపి పి డేవిడ్ రాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ఇన్స్ స్పెక్టర్ వెంకన్న, ఐటీ కోర్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కో..ఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, మేనేజర్ అజయ్ కుమార్ తో పాటు ఏ. హెచ్ టి.యు పోలీస్ సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News