- జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందంలకు కృతజ్ఞతలు తెలియజేసిన
- వావిలాల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వానరసి జాన్
నేటి సాక్షి, జమ్మికుంట:
వావిలాల నగరం నాగారం గోపాలపూర్ పాపక్కపల్లి గ్రామాల రైతుల పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో వావిలాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే గోదాం నిర్మాణానికి తీర్మానం చేసినందుకుగాను వావిలాల కాంగ్రెస్ కమిటీ గ్రామ శాఖ అధ్యక్షుడు వానరాశి జాన్ గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా వావిలాల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వానరాశి జాన్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా సన్నపు వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కిందని దశాబ్దాలుగా రైతుల పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పుల్లూరి స్వప్న సదానందం ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం మరియు పాలకవర్గానికి వానరాసి జాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





