- జిల్లా ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమలాపూర్ ఈసి కార్తీక్
నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ యూనియన్ పాత కమిటీ పదవి కాలము ముగిసిన సందర్భంగా నూతన కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ ప్రెసిడెంట్ గా కమలాపూర్ ఈసి కార్తీక్, జనరల్ సెక్రెటరీగా ఎల్కతుర్తి ఈసీ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ గా ఆత్మకూర్ ఈసి రాము, ట్రెజరీ గా ధర్మసాగర్ ఈసి శ్రీను, మిగతా ఈసీలందరూ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా కొనసాగుతారని నూతనకమిటీ సభ్యులు తెలియజేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు డి ఆర్ డి ఓ మేన శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని హనుమకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ నూతన కమిటీ సభ్యులు తెలియజేశారు.

