నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి గ్రామ గాయత్రి విశ్వబ్రహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, సంఘం అధ్యక్షుడిగా చిలుముల హన్మయ్య చారి, ఉప అధ్యక్షుడిగా రాజూరి బ్రహ్మ చారి, కార్యదర్శి గా రాజూరి రవీందర్ చారి,కోశాధికారి రాజూరి విష్ణు కుమార్ చారి లను నియమిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు, నూతన కమిటీ సభ్యులను గౌరవ అధ్యక్షులు రాజూరి శ్రీకాంత్ చారి శాలువ తో సన్మానించారు, నూతన అధ్యక్షులు హన్మయ్య చారి మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కి అన్నివేళలా కృషి చేస్తానని సంఘం సభ్యులకు ఏ సమస్య వచ్చిన ముందుండి పనిచేస్తానని అన్నారు, ఈ నూతన కమిటీ ఎన్నికలలో గోవిందా చారి,రాజేందర్, మహేష్ సద్గుణ చారి, రఘురామ్, అరుణ్, సందీప్,సాయి కృష్ణ లు పాల్గొన్నారు..




