
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
అయ్యప్ప స్వామి దేవాలయం వనపర్తి శనివారం అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో నూతన అయ్యప్ప సేవా సమితి ఆలయ కమిటీని.2025. ఎన్నుకోవడం జరిగింది..అధ్యక్షులుగా ముత్తు కృష్ణ గురుస్వామి. ప్రధాన కార్యదర్శిగా చీర్ల కృష్ణ గురుస్వామి. కోశాధి కారిగా దొడ్ల పాపి రెడ్డి గురుస్వామి..ప్రచార కార్యదర్శిగా అమర వాది నరేందర్ శెట్టి గురుస్వామి ఈ కమిటీకి పూర్తిస్థాయిగా సహాయ సహకారాల అందించినటువంటి కరెంటు వెంకటయ్య గురుస్వామి కి,కాగితాల లక్ష్మీనారాయణ గురు స్వామి కి ప్రత్యేక ధన్య వాదములు. ఈ రోజునే పూర్తిస్థాయి కమిటీ కూడా ఏర్పరచుకోవడం జరిగినది.. ఇట్టి సమావేశానికి సీనియర్ గురుస్వాములు, స్థల దాతలు, శాశ్వత సభ్యులు, అన్నా ప్రసాద దాతలు, గురు స్వాములు, భక్తులు, మాలాధారులు, ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ స్వామి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు..





