Thursday, April 2, 2026

విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం

ఎలక్ట్రికల్ ఎస్సీ ఈ సురేంద్ర నాయుడు

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలంలో విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి కృషి చేస్తామని ఏపీ ఎస్పీడీసీఎల్ సూపర్డెంట్ ఇంజనీర్ సురేంద్ర నాయుడు అన్నారు సోమవారం మిట్టకండ్రిగ, కమ్మ కండ్రిగ గ్రామాలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ సురేందర్ నాయుడు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి సమస్య పరిష్కారం కార్యాలయంలో ఫోన్ నెంబర్ కాల్ చేసి వెంటనే తమ సమస్యలను వాట్సప్ ద్వారా సమాచారం అందించారు. సోలార్ ప్రతి ఇంటికి పెట్టేందుకు కిలో వాట్ 60 వేలు ఒక కిలో వాట్ విద్యుత్తు ఏడు రూపాయలు ప్రభుత్వం ఇబ్బంది లేకుండా నారావారిపల్లెలో నిర్వహించడం అదే ప్రకారం జిల్లాలోని గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో పలు విద్యుత్ సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు ప్రతి సమస్యను రాతపూర్వకంగా నమోదు చేసుకుని పరిష్కరించి తిరిగి ఫిర్యాదుదారునికి వేస్తామన్నారు. అనంతరం గ్రామస్థులు ఈ కార్యక్రమంలోఏడి శంకరయ్య, ఏ ఈ గిరిబాబు ప్రతిపాదనలు నమోదు చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను తె లుసుకోవాలని సూచించారు మహేష్ మాట్లాడుతూ 1970..విద్యుత్ సర్వీస్ తాత ముత్తాతల పేరుతో పొలంలో ఉన్న రైతులు వారుసులు పేరు పై విద్యుత్ మోటార్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆరు నెలల ఒకసారి విద్యుత్ సమస్యలపై సమావేశం ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కలిగించాలని కోరారు. ప్రతి ఎంపి స్విచ్ సింగిల్ పేస్ ట్రాన్స్పర్ చాలా ఇబ్బందుల్లో గడుపుతున్నామని విద్యుత్ సరఫరా సక్రమంగా సరైన సమయంలో విద్యుత్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కోరా హరి ప్రసాద్, లెక్కల మహేష్ నాయుడు,లెక్కల సురేంద్ర నాయుడు, మేకల తిరుమలరెడ్డి, జనార్దన్ చౌదరి, ప్రసాద్ నాయుడు, జగదీష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News