Saturday, March 14, 2026

జనవరి 27న ఉద్యోగుల భవిష్య నిధి జిల్లా అవగాహన శిబిరం

  • అసిస్టెంట్ పిఎఫ్ కమీషనర్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలో జనవరి 27న జిల్లా అవగాహన శిబిరం, ఔట్రచ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అసిస్టెంట్ పిఎఫ్ కమీషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెల 27వ తేదీన ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ఒకవేళ సెలవు దినం అయినట్లయితే తదుపరి పని దినంలో నిర్వహించడం జరుగుతుందని, నిర్మల్ జిల్లా కార్యాలయం పరిధిలోకి వచ్చే మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని, మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం దేవాపూర్ లోని ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ సమావేశ మందిరంలో ఈ నెల 27న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.45 గంటల వరకు శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరం సభ్యుల ఫిర్యాదుల పరిష్కారం వేదికగా, సమాచార మార్పిడి నెట్వర్క్ పని చేస్తుందని, సభ్యులు తమ ఫిర్యాదులను జిల్లా కార్యాలయ ఈ-మెయిల్ do.nirmal@epfindia.gov.in కు పంపించవచ్చని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News