నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : కోరుట్ల నియోజకవర్గంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి కోరారు.మంగళవారం ఆయన రైతులకు యూరియా కొరత లేకుండా చూడలి అని సెల్ ఫోన్ ద్వారా అధికారులకు తెలిపారు.అదే విధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం రబీ కంటే కంటే ఎక్కువ ఈ రబీలో మొక్కజొన్న ఎక్కువ సాగు చేశారు,దానికి అనుగుణంగా ఎక్కువ యూరియా తెపించ్చాలని జెడిఏ కు వివరించారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో యూరియా చాలా అవసరం దింతో ఈ ప్రాంతంలో కొరత వలన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు ఇబ్బందులు పడితే తమ ప్రభుత్వంకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని పేరు ఉంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని తెలిపారు.




