Friday, April 3, 2026

ఘనంగా ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు

  • శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ బిజెపి పార్టీ శ్రేణులు

నేటి సాక్షి, శామీర్‌పేట్‌ : భాజపా నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ శ్రేణులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకలను ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా నాయకులు గంగిశెట్టి రాజు, నల్ల సుమన్, యాళ్ల సంజీవరెడ్డి, పోతుల సంజీవ్ తదితరులు ఈటెల రాజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు కేక్ కట్ చేసి హర్షాతిరేకాలతో సంబరాలు నిర్వహించారు. ఈటెల రాజేందర్ ఈ ప్రత్యేక సందర్భంలో తనను మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ప్రజాసేవకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News