Monday, March 9, 2026

ఇథనాల్ కంపెనీ అనుమతులను రద్దు చేయాలి

  • తిప్పారపు శ్రీనివాస్, సిపిఎం మండల కార్యదర్శి

నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ, పోతారం గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణిలో వ్యక్తిగత ఫిర్యాదు చేసిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిపిఎం నాయకత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశామని అన్నారు. ఇథనాల్ కంపెని వలన చుట్టూ 10 గ్రామాల పరిధిలో భూసారం దెబ్బతిని పంటలు పండక ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. ఈ కంపెనీ నుండి వెలువడే విషవాయువుల వలన ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని. ప్రకృతి ద్వంసం అయి కాలుష్యం బారిన పడి ప్రజల ఆరోగ్యాలకు, ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తరతరాలుగా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇక గ్రామాలలో ఉండే పరిస్థితి ఉండదని, భూగర్భజలాలు అడుగంటి పోయి త్రాగునీరు, సాగునీరు పంటలపై ప్రభావం పడి ప్రజలు జీవించలేని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కంపెనీ పరిధిలోని గ్రామాల ప్రజలు కంపెనీ నిర్మాణం చేపట్టవద్దని నిరసనలు తెలియజేస్తున్నా కంపనీ యాజమాన్యం పట్టించుకోకుండా పనులను కొనసాగిస్తుందని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఇథనాల్ కంపనీ అనుమతులు రద్దు చేయాలన్నారు.లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News