నేటిసాక్షి(కె గంగాధర్ ) పెగడపల్లి : పెగడపల్లి మండలం బతికే పెల్లి గ్రామానికి చెందిన గాలిపెల్లి రాజమౌళి-అనూష ల కుమార్తె గాలిపెల్లి స్నేహ కు ఈనెల 10న గ్రూప్ 1 ఫలితాలు విడుదల కాగా 517 మార్కులు వచ్చాయి రాష్ట్రస్థాయిలో 485 ర్యాంకు సాధించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల నుండి నియామక పత్రం అందుకోనున్నట్లు అనూష తండ్రి రాజమౌళి తెలిపారు. రాజమౌళి-అనూష కి ఇద్దరు కూతుర్లు కాగా మొదటి అమ్మాయి స్నేహ ఇంతకు పూర్వం (సి ఎ )పూర్తిచేసుకుని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం నిర్వహిస్తూ గ్రూప్ 1 కు ప్రిపేర్ అయి మొదటి ప్రయత్నంలోనే 485 రాష్ట్ర ర్యాంకు సాధించింది. చిన్న కూతురు శ్వేత ఎంసీఏ పూర్తిచేసుకుని ప్రైవేట్ జాబ్ నిర్వహిస్తుంది. రాజమౌళి గోల్డ్ వర్క్ చేస్తుండగా తల్లీ అనూష కుట్టుమిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్నేహ గ్రూప్ 1సాధించడంతో కుటుంబ సభ్యులు. గ్రామస్తులు ఆనంద వ్యక్తం చేస్తూ అనూషని అభినందించారు .



