Monday, December 23, 2024

సురేఖ కాశీకి వెళ్లినా పాపం పోదు..

  • – కాసుల కోసం కోడెలను కబేళాలకు తరలించారు
  • – ఆ పాప ప్రక్షాళనకే శాంతి హోమం
  • – కోడెలను అక్రమ తరలింపునకు ప్రాయశ్చిత్తం
  • – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి

నేటి సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న కోడెలను మంత్రి కొండా సురేఖ సిఫారసుతో అక్రమంగా కబేళాలకు తరలించారని, ఆమె కాశీకి వెళ్లినా ఆ పాపం పోదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ఆదేశాల మేరకు బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో శాంతి హోమం నిర్వహించారు. హనుమకొండ నుంచి తెచ్చిన కోడెను రాజన్నకు సమర్పించారు. మున్సిపల్​చైర్​పర్సన్​రామతీర్థపు మాధవిరాజుతో కలిసి వేములవాడ గోశాలను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పరమేశ్వరుడికి ఆగ్రహం వస్తే మూడో కన్ను తెరిస్తే, ముల్లోకాలు విలయతాండవం ఆడుతాయని, అలాంటిది, ఏకంగా శివుడి వాహనమైన నందినే కబేళాలకు తరలించి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తీసుకుందని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ కాశీకి వెళ్లినా ఆమె పాపం పోదని, స్వయంగా ఆ రాజన్న కోడెనే అపచారం చేశారన్నారు.

మంత్రి కొండా సురేఖ కాదు ఆమె కాసుల సురేఖ, కాసుల కోసం కోడెలను కబేళాలకు పంపిన కసాయి సురేఖ అని మండిపడ్డారు. ఆమె అమ్మింది కోడెలను కాదు.. కోట్లాది హిందువుల ఆచారాలు, విశ్వాసాలు, నమ్మకాలు అని మండిపడ్డారు. పరమ శివుడు, ఆదిదేవుడు, రుద్రేశ్వరుడు వేములవాడ రాజన్న కోడెలను కబేళాలకు తరలించిన పాపానికి, పాప ప్రక్షాళన కోసం, ప్రాయశ్చిత్తం కోసం ఓరుగల్లు ప్రజల తరుపున, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని రాజన్న భక్తుల తరుపున, కోట్లాది హిందువుల పక్షాన బిఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో వేములవాడకు కోడె మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. తప్పు రాజు చేసినా, మంత్రి చేసినా ఆ ప్రభావం రాజ్యంపై, ప్రజలపై ఉంటుందని, ఆ ప్రభావం నుంచి ప్రజలను రక్షించుకోవడం కోసమే బీఆర్​ఎస్​ పక్షాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఓరుగల్లు ఒక గొప్ప శైవ క్షేత్రం
అడుగడుగునా శివాలయాలలో విలసిల్లుతున్న గడ్డ, సుమారు 400 ఏళ్లపాటు ఓరుగల్లు రాజధాని కేంద్రంగా పాలన చేసిన కాకతీయులు గొప్ప శివ భక్తులని అలాంటి, ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహిస్తూ, ప్రజా విశ్వాసాలకు విరుద్ధంగా స్వయంగా తన సిఫారసుతో రాజన్న కోడెలను కోతకు పంపి ప్రజల నమ్మకాలను, మనోభావాలను హత్య చేసింది మంత్రి కొండా సురేఖ అని అంతటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా, ఓరుగల్లు బిడ్డగా, శివ భక్తుడిగా ఆ పరమ శివుడికి శాంతి కలిగించడం కోసం శాంతి హోమం నిర్వహించి, కోడె ను చెల్లించడం జరిగిందన్నారు. ఈ రాష్ట్ర ప్రజల పేగుబంధమైన బిఆర్ యస్ పార్టీకి ఈ ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టే ఈ ప్రయత్నం. చేశామన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం రావాలని ముడుపు కట్టడం జరిగిందని,ఆ దేవుడి ఆశీస్సులతో ఆ కోరిక నెరవేరింధని,తెలంగాణ ఉద్యమానికి కూడా ఉద్యమం లో పుడితే ఒక్కటి సత్తే రెండు రాజన్న ఓ రాజన్న అంటూ, రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ వైరభక్తితో సైతం పాటలు పాడుతూ ఆ పరమ శివుడి ఆశీస్సులతో ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు.
కాశీకి పోయినా పాపం పోదు
కొండా సురేఖ చేసిన ఈ పాపం కాశికి పోయినా పోదు. ఎందుకంటే స్వయంగా నంది వాహనాన్నే అపచారం చేశారు. బాధ్యతగల మంత్రి పదవిలో సురేఖ ఉండి, ఇంకా ఘటనపై సమాధానం చెప్పలేదన్నారు. వేములవాడ రాజన్న సన్నిధిలో వరుసగా జరుగుతున్న ఈ అపచారాలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పారు. లేదా వారే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సూచించారు. ఈ కోడెల అమ్మకంలో ప్రధాన పాత్రదారులందరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దేవుని సొమ్ము స్వాహా చేస్తారా.?
సుమారు రూ.2 కోట్ల దేవుడి సొమ్ము, భక్తుల కానుకలను దోచుకొని కాంగ్రెస్ విజయోత్సవ సభ నిర్వహించారని, 32 వేలకు ఒక్క బిర్యానీ చొప్పున వంద బిర్యానీలు తిన్నారని అన్నారు. దేవుడి సొమ్ముకే రక్షణ లేదని, ఇక ప్రజల సొమ్ముకు రక్షణ ఎక్కడుంటుందని, దేవుడి సొమ్ముకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే, దేవుడి గల్లాపెట్టెను దొంగతనం చేస్తున్నదని, దేవుడి కోడెలు, ఆలయ ఆచారాలు, దేవుడి సొమ్ముకి ధర్మకర్తగా ఉండాల్సిన దేవాదాయ శాఖ మంత్రే హుండీలకు కన్నాలు వేస్తున్నదని, మిమ్మల్ని ప్రజలు క్షమించినా.. ఆ భగవంతుడు క్షమించడని చెప్పారు. ధర్మం జోలికి వెళ్లిన ఎవ్వరూ పొడు కాలేదని, బీఆర్​ఎస్​ఈ అంశాన్ని రాజకీయం చేయలని చూడటం లేదన్నారు. మాకు రాజకీయాలు చెయ్యడానికి అనేక సమస్యలున్నాయి. కానీ, ప్రజల విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి, కేటీఆర్ సూచనల మేరకు ఒక శివ భక్తుడిగా, ఓరుగల్లు బిడ్డగా శాంతి హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News