- కాసీపేట 2 గని మేనేజర్ జి. లక్ష్మీనారాయణ
నేటి సాక్షి, మందమర్రి:- సింగరేణి ఉత్పత్తి సాధన సమయంలో ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటిస్తూ, విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని ఏరియాలోని కాసీపేట 2 గని మేనేజర్ జి లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం గని పై నిర్వహించిన సమావేశంలో కార్మికులకు రక్షణ, ఉత్పత్తి తోపాటు ఈ సంవత్సరం గనికి సంబంధించి ఇంకా సాధించవలసిన ఉత్పత్తి విషయాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా గత నెల 11వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినందుకు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయస్ఫూర్తితో కార్మికులందరూ కలిసి అంకితభావంతో పనిచేసి అధిక ఉత్పత్తి సాధించాలని కోరారు. అదేవిధంగా షిఫ్ట్ ల వారిగా ఉద్యోగుల గైర్హాజరు హాజరు శాతాన్ని తగ్గించి, ఉత్పత్తిలో కాసీపేట 2 గని సింగరేణి సంస్థ ఎదుగుదలను అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం జనవరిలో రక్షణలో, ఉత్పత్తిలో మంచి ప్రతిభ కనబరిచిన కొంతమంది ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ గని పిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్, గని రక్షణ అధికారి, సంక్షేమ అధికారి, ఇంజనీర్, సర్వేయర్, గని ఉన్నత అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.





