Tuesday, March 10, 2026

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతీ హిందువు త్రికరణ శుద్ధిగా పని చేయాలి

హిందూధర్మం మహోన్నతమైన జాతీయ జీవన విధానం.
జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ వేముల రాంరెడ్డి

నేటిసాక్షి, రాయికల్:
సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ప్రతీ హిందువు త్రికరణ శుద్ధిగా పని చేయాలని జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ వేముల రాంరెడ్డి అన్నారు. రాయికల్ మండలం రాయికల్ పట్టణంతో పాటు రామాజీపేట్ గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ఉత్సవం, వివేకానంద జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మార్గదర్శనం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్.ఎస్.ఎస్. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా, నిత్య శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. వేద, పురాణ, ఇతిహాసాలలో, సనాతన ధర్మ సంస్కృతి లో ఎక్కడా కూడా కుల ప్రస్తావన, వివక్ష లేదని వీటన్నింటిలో ఆచరణాత్మకమైన సామాజిక సమరసత ఇమిడి వుందని అన్నారు. హిందువుల అనైక్యత వలన వేల సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారని, ప్రస్తుత వర్తమానంలో హిందులందరు కులాలకు, రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా వుండి సనాతన ధర్మ పరిరక్షణకై పని చేయాలని సూచించారు. లేనిచో కుహానా లౌకిక వాదులు తమ స్వార్థం కోసం హిందువుల మనుగడే కే ప్రమాదం సంభవింపజేసే ప్రమాదం వుందని అన్నారు. ప్రపంచంలోనే లోకా సమస్తా సుఖినోభవంతు, సర్వే జనా సుఖినోభవంతు అని ఆచరించే ఏకైక ధర్మం సనాతన ధర్మమని అన్నారు. విదేశీయులు, విధర్మీయులు మన సంస్కృతి ని కొంతవరకు విచ్ఛిన్నం చేసారని, ప్రస్థుతం కులాలు, మూఢాచారాల పేరుతో విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని అన్నారు. సంక్రాంతి అంటే మార్పు అని దీని స్త్ఫూర్తితో మనలో మంచి మార్పురావాలని అన్నారు, వివేకానంద జయంతి సందర్భంగా ఆయన స్పూర్తితో ఆశయ సాధనలతో సంఘం సనాతన ధర్మంలో పేర్కొన్న వాటి ఆధారంగా భారతదేశం విశ్వాసులు స్థానం అధిరోహించడానికి పని చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గో సేవా ప్రముఖ్ బీరెల్లి సంతోష్, వార్షికోత్సవం సందర్భంగా స్వయం సేవకులతో రాయికల్ లో ఖండ బౌద్ధిక్ ప్రముఖ్ జితేందర్ రెడ్డి, రామాజీపేట్ లో ఖండ సంపర్క్ ప్రముఖ్ పందిరి లక్ష్మీ నర్సయ్య లు శారీరక ప్రయోగాలు చేపించారు. ప్రార్థన అనంతరం సంక్రాంతి ప్రత్యేక మిఠాయి బెల్లం నువ్వులు ముద్దలను ప్రసాదంగా స్వికరించారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామి యాదవ్, కుర్మ మల్లారెడ్డి, తోపారపు రవీందర్, కుర్ర శ్రీనివాస్, చెంగలి మహేష్, గన్నవరం గంగాధర్, రాజేశం, సామల్ల సతీష్, వీరబత్తిని శంకర్, పటేల్ రాము, కంటె భూమేష్, ఇద్దం గంగారెడ్డి, సూర సాయి స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News