నేటి సాక్షి, మంచిర్యాల బ్యూరో:- సింగరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు చేయడంతో కార్మికులతో పాటు సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం కలగదని, దీనివల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. బుధవారం సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని కార్మికులను కలిసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులకు సొంతింటి పథకం అమలు సాధ్యాసాధ్యాలను వివరించారు. సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ముందు ఆరు సంఘాలతో ఒప్పందం చేసుకున్న మారుపేర్లు సమస్య అదే విధంగా పెర్క్స్ పై ఐటి తదితర వాటిపై సింగరేణిలో గెలిచిన గుర్తింపు సంఘమైన ఏఐటియుసి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టియుసి లు స్ట్రక్చరల్ సమావేశంలో చర్చించి, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.





