

నేటి సాక్షి, మెట్ పల్లి (గోరుమంతుల నరేందర్) : పట్టణంలో ప్రతి ఒక్కరు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. మంగళవారం కమిషనర్ పలు వార్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డులలో స్పెషల్ శానిటేషన్ పనులు నిర్వహించడం జరుగుతుందని వార్డులో ప్రధానమైన మురికి కాలువలు తీయించడం జరుగుతుందని తెలిపారు.ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మీ ఇంటి ముందర ఉన్న మురికి కాలువలో ఇంటి నుండి వెలువడే చెత్తను గాని ప్లాస్టిక్ కవర్స్ గాని పారేయరాదని తెలిపారు. మురుగు కాలువలో కాని రోడ్లపై గాని చెత్త వేసినచో జరిమానా విధించబడునని హెచ్చరించారు. మున్సిపల్ ఆటోలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, దుకాణ యజమానులు ప్లాస్టిక్ కవర్స్ వాడ రాదని వాడినచో జరిమానా విధించి లైసెన్స్ రద్దు చేస్తామని ప్రత్యామ్నాయంగా జుట్ బ్యాగులు వాడాలని అన్నారు. అలాగే పారిశుధ్య సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, నరేష్,నిజాం పాల్గొన్నారు.





