నేటి సాక్షి, మందమర్రి:- బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు దుద్దిల్ల శ్రీపాద రావు అని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని సింగరేణి ఏరియాలోని కేకే ఓసీపీ గని మేనేజర్ రామరాజు తెలిపారు. ఆదివారం ఏరియాలోని కేకే ఓసిపి ప్రాంగణంలో శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఆయన సమర్థవంతగా విధులు నిర్వహించారని, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఎస్ఓ రవీందర్, యూనియన్ నాయకులు, ఓసిపి సిబ్బంది పాల్గొన్నారు.




