- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల జిల్లా ( కోక్కుల వంశీ ) : బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్-XI విజయవంతం కోసం ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటుఅధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 31 మంది పిల్లలని గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 08 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను చూసినప్పుడు, డయల్ 100 లేదా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.





