Monday, March 23, 2026

ఎములాడ ‘ మహా ‘ శివరాత్రి జాతరకు సర్వం సిద్ధం..!

  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : రాజన్న మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ లో ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణ ప్రజల ఇలవేల్పు వేములవాడ రాజన్న ఆలయం ఈ నెల 25,26,27 తేదీలలో జరిగే మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను పూర్తి అయ్యాయని అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు కలెక్టర్, ఎస్పీ, ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకొని మహాశివరాత్రి జాతర వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కాకుండా మెరుగైన వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించు స్వామి వారి సేవలో తరించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News