- గౌరిశెట్టి భవాని చూపు సజీవం..
- ఆదర్శం కుటుంబం
- కుటుంబ సభ్యులను అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు…
- నేత్రాలను సేకరించిన ఎల్.పి.వి. వైద్య నిపుణులు రాజేంద్రప్రసాద్

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణం గాంధీనగర్ నివాసి గౌరీశెట్టి భవాని (48) గుండె పోటుతో గురువారం మధ్యాహ్నం 2:30 గం.లకు మృతి చెందారు. జమ్మికుంట వ్యాపారి కాసం నగేష్ సమాచారం మేరకు గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్, రావి కంటి రాజేందర్, యోగ గురువు నరహరి, నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా, కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో యోగా గురువు మరియు సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మచ్చగిరి నరహరి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్.పి.వి. వైద్య నిపుణులు రాజేంద్ర ప్రసాద్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్.పి.వి. ఐ బ్యాంక్ కు పంపడం జరిగింది. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భర్త గౌరీశెట్టి శ్రీనివాస్, కూతురు సంయుక్త, సహకరించిన వంగల రమేష్, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కాసం నగేష్, రావి కంటి రాజేందర్, బంధుమిత్రులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి లగిశెట్టి చంద్రమౌళి, మరియు బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

