Monday, March 30, 2026

నేత్ర దానంతో ఇద్దరు అంధులకు చూపు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : 66వ డివిజన్ హాసన్ పర్తి మండల కేంద్రం లోని మీసరికొండ నరసయ్య అనారోగ్యం తో మరణించగా భార్య వెంకట లక్ష్మి, కుమారులు కుమార స్వామి, సాంబయ్య, రమేష్, యుగేందర్, కూతురులు రమ, రజిత లు సమాజహితం కోరి నేత్ర దానానికి ముందుకు రాగ తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ హన్మకొండ, వరంగల్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సిబ్బంది ప్రసాద్, నేత్ర సేకరణ నిపుణులు ప్రదీప్ లు నేత్ర (కార్నియా) సేకరణ చేశారు. నరసయ్య నేత్రదానం తో ఇద్దరు అంధులకు చూపునిచ్చారు, నేత్ర వైద్య విద్యకు తోడ్పడినారు. ఈ సందర్భంగా అసోసియేషన్ హన్మకొండ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు ధన్య వాదములు తెలుపుతు నేత్రదాన సర్టిఫికెట్ అంద జేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ అధ్యక్షులు పరికిపండ్ల వేణు, కొన్ రెడ్డి మల్లారెడ్డి లు మరియు కార్యవర్గ సభ్యులు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వస్తే వివరాలకు ఈ క్రింది సెల్ నెంబర్ లలో 9490133650,8790548706 సంప్రదించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News