నేటి సాక్షి,వేమనపల్లి; శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ సేవలోను పోలీసులు ముందుంటారని రుజువు చేశారు నీల్వాయి పోలీసులు. గత నెల పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో సుమారుగా 67 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించారు. చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, ఎస్సై శ్యాం పటేల్ అధ్వర్యంలో వైద్యుల సూచనల మేరకు వారిని సోమవారం వాహనాల ద్వారా మంచిర్యాలలోని శంకర్ నేత్రాలయ హాస్పిటల్ వారి సహకారంతో 25 మందికి కంటి అపరేషన్ చేయించారు. త్వరలోనే వారికి కళ్లజోళ్లు పంపిణీ ఇప్పిస్తామని అన్నారు. మిగతా వారికి మళ్ళీ తేదీ ప్రకటించి ఆపరేషన్ క్యాంపుకు తరలించి కంటి ఆపరేషన్ చేపిస్తామని తెలిపారు. కంటి ఆపరేషన్ చేసుకున్నవారు పోలీసుల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ చట్టపరిధిలో సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత,రక్షణ కోసం పని చేస్తామని ఎస్సై శ్యామ్ పటేల్ ఈ సందర్భంగా తెలిపారు.

