- మా అత్త లక్ష్మి చెప్పిన మాటల్లో వాస్తవాలు లేవు.
- ఆమెను భయభ్రాంతులకు గురిచేసి మా పై ఉసిగొలుపుతున్నారు.
- ఒకప్పుడు నన్ను కన్నతల్లి లాగా చూసుకుంది
- మమ్మల్ని మోసం చేసి భూమి వాళ్ల పేరిట చేపించుకున్నారు
- మాకు తగు న్యాయం చూపాలి
- తోగరు లక్ష్మి కోడలు ఐన ధనలక్ష్మి ఆవేదన
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు):
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామంలో మొన్నటి రోజు అనగా శనివారం రోజున తొగరు లక్ష్మి 80 సంవత్సరాల వృద్ధురాలు ఆమెకు ఒక కొడుకు కూతురు అని తన కోడలు, మనుమడు దౌర్జన్యంగా భూమి లాక్కునే ప్రయత్నంలో ఉన్నారని ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మీడియా ప్రతినిధుల ముందు రెండు రోజుల క్రితం ఆరోపణ చేశారు. ఇదిలా ఉండగా తొగరు లక్ష్మి కోడలు అయినా తొగరు ధనలక్ష్మి సోమవారం రోజున కొంతమంది గ్రామస్తుల తో కలిసి మీడియా ప్రతినిధులతో తనకు జరిగిన అన్యాయం,మోసం గురించి వివరణ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే తమ అత్త అయిన తోగరు లక్ష్మి రెండు రోజుల ముందు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని, వాస్తవాలను తారుమారు చేసి తొగరు లక్ష్మిని తన కూతురు, అల్లుడు, మనుమరాలు భయభ్రాంతులకు గురి చేస్తూ చంపేస్తానని బెదిరిస్తూ ఆస్తిని లాక్కొని మాకు అన్యాయం చేద్దామని దురాలోచనతో మాపై ఉసిగొలుపుతున్నారని ఆవేదన చెందారు. అంతేకాకుండా తన భర్త అయిన తోగరు పురుషోత్తం కరోనా వల్ల చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఆడబిడ్డ భర్త జెట్టి సదానందం వచ్చి పెద్దమనుషుల సమక్షంలో తన అత్త అయిన తోగరు లక్ష్మిని రెండు రోజులు ఇంటికి తీసి వెళ్లి మళ్లీ తీసుకొస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఎన్నోసార్లు కొందరి పెద్దమనుషుల సమక్షంలో తొగరు లక్ష్మిని పంపివ్వమని నేను ఇంటికి వెళ్లి పలుమార్లు అడుగితే రేపు మాపు పంపిస్తానని మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా అదే అదునుగా భావించి మా అత్త తోగరు లక్ష్మికి మాపై మాయ మాటలు చెప్పి, మాకు ఎలాంటి ఆస్తి ఉండకూడదనే నెపంతో పట్టా పాస్ బుక్ క్రాఫ్ లోన్ కింద యూనియన్ బ్యాంకు లో ఉండగానే అధికారుల అండదండలతో మూడెకరాల భూమిని జెట్టి సదానందం తన బిడ్డ పేరిట చేపించుకున్నాడని ఇప్పుడు మా అత్త పేరుమీద ఉన్న ఎకరం నర భూమిని కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అదేవిధంగా మా అత్త ఐన తొగరు లక్ష్మిని ఇబ్బంది పెడుతూ మా ఇంటికి రానివ్వకుండా మరియు మేము భూమి దగ్గరికి వెళితే మాపై కూడా ఇతరుల సమక్షంలో దౌర్జన్యం చేస్తున్నారని, వారు న్యాయంగా ఉంటే వారికి ఎలాంటి మోసపూరితమైన ఆలోచనలు లేకుంటే కానిపర్తి గ్రామస్తులతో పంచాయతీ పెట్టడానికి సిద్ధమని గ్రామస్తుల ఇచ్చే ఎలాంటి తీర్పునకు ఐనా కట్టుబడి ఉంటానని తమకు అన్యాయం జరుగుతుంటే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదని జెట్టి సదానందం మా పైన చేసే మోసపూరితమైన చర్యలకు అడ్డుకట్ట వేసి మాకు న్యాయం చేయాలని కొడుకు,కూతురుతో, గ్రామస్తుల సమక్షంలో తోగరు ధనలక్ష్మి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సదానందం అనే వ్యక్తి ధనలక్ష్మికి అన్యాయం చేస్తున్నాడని భావనతో గ్రామంలో కొంతమంది పెద్దమనుషులు ఇరువురికి న్యాయం జరిగేలా చూస్తామని పలుమార్లు సదానందం కు సమాచారం ఇచ్చినా కూడా గ్రామానికి రాకపోగా గ్రామ పెద్దల మాటలు పట్టించుకోకుండా తొగరు ధనలక్ష్మిని మోసం చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు.