Thursday, March 19, 2026

జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి

మహశివరాత్రి జాతర ఉత్సవాలపై సమన్వయ సమావేశం

నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వరనాగాలయంలో మహ శివరాత్రి జాతర ఉత్సవాలపై వివిధ శాఖాల అధికారుల సమావేశం ఆలయ ఆవరణలో మంగళవారం జరిగింది. ఆలయంలో జరిగే జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించలలా అన్ని శాఖాల అధికారులు సమన్వయంతో పని చేయాలని తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ ఖయ్యుం కోరారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న దృష్ట్యా ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిటి గణేష్, ఎంపిఓ సుష్మ, ఎస్ఐ సుధీర్రావు, పంచాయతీ రాజ్ ఎఇ ప్రసాద్, వైద్యులు డాక్టర్ సతీష్, ట్రాన్స్కో ఎఇ రాజేశం. ఆలయ ఇఓ విక్రమ్, అర్చకులు చెరుకు రాజేశ్వరశర్మ, మాజీ ప్రజాప్రతినిదులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News