నేటి సాక్షి, మెట్ పల్లి : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మంగళవారం ఫ్యామిలీ కాన్సిలింగ్ దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇటీవల చిన్న చిన్న ప్రమాదాలకు కారకులైన డ్రైవర్లకు ఇకపై ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి వారితో కలిసి డిపో మేనేజర్ దేవరాజు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి,నాగన్న, నారాయణ, ఆగయ్య, కిరీటి తదితరులు పాల్గొన్నారు.





