నేటి సాక్షి-కరీంనగర్: కొత్తపల్లి మండలంలోని చింతకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య సీబీఎస్ఈ సిఓ ఐపీఎల్ బ్రాంచ్ లో ఫ్యామిలీ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజకుమార్ ఆచార్య మాట్లాడుతూ…శ్రీ చైతన్య అకాడమిక్స్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా ఫ్యామిలీ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులలో తల్లిదండ్రులు అంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉండాలని, ఒక మంచి సంస్కృతికి స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటి సమాజంలో విద్యార్థులు పెడదోవ పడుతున్నారని, విద్యార్థులకి చిన్నతనం నుండే క్రమశిక్షణ, తల్లిదండ్రులు, గురువుల పట్ల మర్యాద సమాజంలో ఎలా నడుచుకోవాలనే విశాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. సమాజంలో విద్యార్థుల పాత్ర ఏంటో వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు అందరికీ ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థి, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం చేతుల మీదుగా వారి తల్లిదండ్రులకు శాలువాతో సత్కరించి వారికి సన్మానించారు. భవిష్యత్తులో శ్రీ చైతన్య సీబీఎస్ఈ సివోఐపిఎల్ బ్రాంచ్లో అకాడమిక్స్ పరంగా అనేక రకాల సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమ, జిఎం నాగేంద్ర, చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజింలు ఏం రాజు, సదాశివరెడ్డి, అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్ లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఓ ఐపీఎల్ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి, సి ఇన్చార్జ్ జయవర్ధన్ రెడ్డి, ఏవో కిషన్ రెడ్డి, క్యాంపస్ ఇంచార్జ్ నాగేందర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సిఈటిలు పాల్గొన్నారు.





