సీనియర్ జర్నలిస్టు కుటుంబాన్ని అభినందించిన తాజా మాజీ సర్పంచ్, గ్రామస్తులు
నేటి సాక్షి, శంకరపట్నం:
కోరిన కోరికలు తీర్చి, కొంగు కొంగుబంగారమయ్యే శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం గ్రామానికి చెందిన భక్తుడు, కుటుంబ సభ్యులు ఫ్యాన్లను బహుకరించినట్లు గ్రామ తాజా మాజీ సర్పంచ్ మోరె అనూష శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా అనూష శ్రీనివాస్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలోని కాకతీయుల నైజాం కాలం నాటి దేవాలయం భక్తుల కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారమయ్యే శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, తాజా మాజీ వార్డు సభ్యురాలు దండు స్వరూప సమ్మయ్య, వారి కుమార్తె అల్లుడు వెజ్జ కీర్తి కిరణ్ దేవాలయానికి ఫ్యాన్లను బహుకరణ చేసినందుకు గ్రామస్తుల భక్తుల పక్షాన వారి కుటుంబ సభ్యులను అభ్యర్థిస్తున్నట్లు అనుష శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం, సభ్యులు భక్తులు, తాజా మాజీ వార్డు సభ్యులు గాజుల మహేష్, గాజుల సంపత్, చిరుత ప్రవీణ్, రేండ్ల సాంబశివారెడ్డి, తుమ్మ రఘుపతి, అన్నం బుచ్చిరెడ్డి, చీకట్ల సతీష్, నల్ల తిరుపతిరెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





