నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ :
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం, తిప్పాపూర్ గ్రామం లో బుధవారం రోజు, పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మల్లారెడ్డి అనే 61 సంవత్సరాల రైతు, విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బోరు బావి స్టార్టర్ వద్ద బోర్డులో గలవిద్యుత్ తీగలు, చేతికి తగలడంతో విద్యుత్ షాక్కు గురై రైతు మృతి చెందాడని గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఇట్టి విషయమై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.