- ముఖ్యఅతిథిగా సుంకర అజయ్ కుమార్
నేటి సాక్షి, మునగాల : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం బిఆర్ఎస్ పార్టీ మునగాల మండల అధ్యక్షులు తోగరు రమేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సుంకర అజయ్ కుమార్ పాల్గొని కెసిఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో సంబరాలు నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించారని తెలిపారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసి. అన్ని వర్గాలకు సామాన్యాయం చేసిన ఘనత కెసిఆర్ కే దక్కిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబోవు రోజుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. భగవంతుడు, ప్రజల ఆశీర్వాదం తో నిండు నూరేళ్లు చల్లగా, ఆయురోగ్యాలతో ఉండాలని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత నాయకులు, కార్యకర్తలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ జన్మదిన వేడుకలలో పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, తోగరు సీతారాములు, రామిరెడ్డి, మాజీ జడ్పిటిసి కోళ్ల ఉపేందర్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ లు, ప్రదీప్ , ఉడుం కృష్ణ, ఎల్ పి రామయ్య, సైదా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





