- ఎండిన పంట పొలాలను సర్వే చేయించి ఎకరాకు,రూ. 50 వెలు ఇవ్వాలి
- ఎకరానికి ₹ 50వేల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్ మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
నేటిసాక్షి చేర్యాల: సిపిఎం చేర్యాల మండల మరియు పట్టణ కమిటీల ఆద్వర్యంలో తపాస్ పల్లి రిజర్వాయర్ నింపి వాటితో చేర్యాల మండలం మరియు పట్టణంలోనీ చెరువులు,కుంటలు నింపాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం తగు డిమాండ్ల తో కూడిన వినతిత్రాన్ని. గిర్దావర్ రాజేందర్ రెడ్డి కి అందజేశారు. అనంతరం ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా వచ్చిన వెంకట్ మావో మాట్లాడుతు.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాగా సేవ చేస్తున్నామని కల్లబొల్లి మాటలతో కాలం వెలదీస్తుందన్నారు. చేర్యాల మండలం లోని చెరువులు కుంటలు నింపకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాలు రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతుందనీ ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవాలనే చిత్త శుద్ది ప్రభుత్వానికి లేదన్నారు. చెరువులు కుంటలు నింపుతే రైతుల పంటలు ఎండిపోయేవి కాదన్నారు. రైతులు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి అధిక వడ్డీలు కడుతున్నారని. జిల్లాలో ఇప్పటివరకు సుమారుగా 40 నుండీ 50 శాతం పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందనన్నారు. మార్చి చివరి నాటికి భూగర్భ జలాలు మరింత అడుగంటి పోయే ప్రమాదం ఉందని. దేవాదుల సామర్థ్యం పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం వల్ల రైతులకు శాపంగా మారింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంస్పందించి వెంటనే దేవాదుల నీరు అందించి రైతుల పంట పొలాలు ఎండిపోకుండా చూడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనియెడల రైతులను ఏకం చేసి సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో CPM చేర్యాల మండలం కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్ మాట్లాడారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల కమిటి సభ్యులు గొర్రె శ్రీనివాస్, నాగపూరీ కనకయ్య,దర్శనం రమేష్, రేపాక కుమార్, మోకు ఇంద్రారెడ్డి, దొండకాయల సంపత్, ఎండీ కరీం, పట్టణ నాయకులు రాళ్ళబండి భాస్కర్, మూస్త్యాల ప్రభాకర్, బోయిని మల్లేశం, ఎర్రబోసు అశోక్, దోనికేల కనక లక్ష్మీ, శాఖ కార్యదర్శులు గుండ్ర రవీందర్, పొన్నబోయిన సిద్దులు, కత్తులనరసింహారెడ్డి, పాల వెంకటేశం,యాడారం బ్రమయ్య,గర్నేపల్లి చంద్రం, బింగి రాయుడు, బోడిగాం నర్శి రెడ్డీ, సహదేవులు, కర్రే బాల్ రాజు, ఇమ్మడి సురేందర్, సుర్న బాలయ్య, అది చంద్రమౌళి, తాండ్ర రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



