Saturday, March 14, 2026

సింగిల్ ఫీడర్ తో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు

  • లో కరెంట్ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామ పరిధిలో గత నెల రోజులుగా లో వోల్టేజ్ సమస్యతో స్థానిక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పంట పొలాలకు నీరు అందక ప్రతీ పది నిముషాలకుకోసారి స్టార్టర్ లు పడిపోవడం తో వ్యవసాయ మోటార్ లు కాలిపోతున్నాయని, వేలకు వేలు ఖర్చు పెట్టి తిరిగి తమ మోటార్ లు రిపేర్ చేసుకున్నా తిరిగి అదే సమస్య రావడంతో స్థానిక రైతులు తలలు పట్టు కుంటున్నారు. తమ పంట పొలాలకు చాలి చాలని నీటి సరఫరా తో పంట నష్టము వస్తుందని దీనికి నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నో పలు మార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోకపోవడం తో రైతులు తమ గోడు ను అర్థం చేసుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఈ సమస్య పై దృష్టి సారించాలని మరియు విద్యుత్ అధికారుల అలసత్వం వల్ల నష్టము ఎదుర్కొంటున్న రైతులకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News