Friday, April 3, 2026

రైతులకు అదనపు రుణాలు అవసరం

  • మంజూరు కు ఒప్పుకున్న బ్యాంకర్లు
  • రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి
  • తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : రైతులకు పంట రుణాలకు ఆధారంగా దీర్ఘకాలిక రుణాలు అవసరం ఉన్న నేపథ్యంలో వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ హైకోర్టులో తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. దానికి సంబంధించిన హైకోర్టు హనుమకొండ లోని న్యాయ సేవా సదన్ లో హనుమకొండ, వరంగల్ న్యాయ సేవాధికారుల కార్యదర్శుల సమక్షం లో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ మరియు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు సీనియర్ జడ్జ్ క్షమ దేశ పాండే ఏం. సాయి కుమార్ లు మాట్లాడుతూ బ్యాంకుల నుంచి పంట రుణాలకు ఆధారంగా దీర్ఘకాలిక రుణాలు అవసరం ఉన్నటువంటి రైతులు రుణ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులందరూ ప్రైవేటు అప్పులు తీర్చుకోవడానికి రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు సైతం ఒప్పుకున్నారని తెలిపారు. తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ అప్పుల బాధతో ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే వారి బ్యాంకులలో అప్పు కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికల కిషన్ రావు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్, రైతులు తిరుపతి, రాజు, బాబురావు, సీఫా కో..ఆర్డినేటర్ తోకల ఆదిరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఎ. జి. ఎం చంద్ర శేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి రవి కుమార్, వివిధ గ్రామాల రైతులతో పాటు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News