Sunday, March 29, 2026

నీళ్ల కోసం రోడ్డెక్కిన కేటి దొడ్డి మండల రైతులు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) :
కేటి దొడ్డి యాసంగి సీజన్ లో సాగు చేసిన వరి పంటకు నీరు లేక పొలాలు ఎండిపోవడంతో కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు ధరుర్ మండల కేంద్రంలో ఉన్న ర్యాలంపాడు లో ఉన్న 104 ప్యాకేజ్ కెనాల్ కింద సాగునీరు వదలాలి అని కేటి దొడ్డి మండల పరిధిలో ఆయా గ్రామాల రైతులు అల్లపాడు సబ్స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ : యాసంగి వరి పంటకు కాలువల ద్వారా నీరు విడుదల చేయాలని ఎండిపోతున్న పొలాలను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు గద్వాల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నత అధికారులు 25 -12-2024-15-04-2025 వరకు యాసంగి పంటకు నీరు అందిస్తామని చెప్పడంతో రైతులు దానికి అనుగుణంగా యాసంగి వరి సాగు చేశారు చేశారు కానీ కొన్ని రోజులు నీళ్ళు వదిలి ఇప్పుడు చుక్క నీళ్ళు వదలక పోవడంతో రైతులు తమ పొలాలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు నీళ్ళు చుక్క నీరు కూడా రావడం లేదు 300 – 400 ఫీట్ల లోతుగా బోర్ వేసినా ప్రయోజనం లేకపోవడంతో పంటలు చేతికి వచ్చే దశలో పంటలు ఎండిపోయో పరిస్థితి నెలకొనడంతో రైతులు రోడ్డెక్కారు ధరుర్ మండల కేంద్రంలో ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు కోరారు. సకాలంలో నిరు రాకపోతే పంట పొలాలను పశువులకు మేతగా వదలాల్సి వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News