Monday, March 23, 2026

యూరియా కోసం రైతులకు తిప్పలు

  • రైతుల పట్ల కాంగ్రెస్ చిన్నచూపు
  • డా. రసమయి బాలకిషన్

నేటి సాక్షి, మానకొండూర్: మానకొండూరు  నియోజకవర్గ కేంద్రంలో మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఆగాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నామని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు.యూరియా దొరకకా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుందన్నారు.కమిషన్ల గురించి మర్చిపోయి కాలువల గురించి ఆలోచన చేయమన్నారు.ఎమ్మెల్సీ ప్రచారంలో ఉన్న శ్రద్ధ రైతులకు యూరియా బస్తాలపై ఉండాలన్నారు.కాలువల పెండింగ్ పనులు గురించి మీరు చేయపోతే మేమే రైతులను తీసుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుస్తామన్నారు.రైతుల సమస్యలు పట్టని సీఎం రేవంత్ రెడ్డి బాషా మార్చుకోవాలని హెచ్చరించారు.ఎమ్మెల్సి ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని అందులో కూడా రాజకీయం చేసే పార్టీ కాదని,పట్టభద్రులు సరైన నాయకుణ్ణి ఎన్నుకోవాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News