- అక్కడికక్కడే ఇద్దరు మహిళల మృతి
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలను కారు వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఉదయ నగర్ కు చెందిన నలుగురు మహిళలు పట్టణ శివారుని ఓ ఫంక్షన్ హాల్లో పనులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా, పెద్దపల్లి ఆదర్శనగర్ వద్ద కరీంనగర్ నుండి గోదావరిఖని వెళ్తున్న గుర్తుతెలియని కారు నలుగురు మహిళలను వెనకవైపు నుంచి ఢీకొట్టడంతో అమృత, భాగ్య అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పద్మ, మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరో మహిళ స్వల్ప గాయాలతో నుండి బయటపడింది. అతివేగంగా మహిళలను ఢీ కొట్టిన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ అక్కడ నుంచి పారిపోయిన విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకొని కారును గుర్తించే పనిలో పడ్డారు.